వైరాలో వెయ్యి రోజుల ప్రజాపాలన.. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ఘాటు కౌంటర్!

కేక్ కట్ చేసి సంబరాలు.. హామీల అమలే మా పాలనకు నిదర్శనం: ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Published On
వైరాలో వెయ్యి రోజుల ప్రజాపాలన.. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ఘాటు కౌంటర్!

 

 

వైరా, సెప్టెంబర్ 6, లోకల్ గైడ్ న్యూస్ :

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైరా రింగ్ రోడ్డు వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తెలంగాణ రాష్ట్రIMG-20260906-WA0176 మార్క్‌ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు కలిసి కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. గత పాలనలో ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలకు భిన్నంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రైతులు, మహిళలు, యువత, విద్య, వైద్యం, పేదల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

బీఆర్ఎస్ మాటల పాలనకు.. కాంగ్రెస్ చేతల పాలనతో సమాధానం

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ పాలనకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. విమర్శలకు సమాధానం మాటలతో కాదు.. ప్రజలకు అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధితోనే ఇస్తామని స్పష్టం చేశారు.

వైరా నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో వైరా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని అన్నారు.

1000 రోజుల ప్రజాపాలనకు శుభాకాంక్షలు

1000 రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రివర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బోళ్ల గంగారావు, ఆత్మ చైర్మన్ మత్తూరు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి, వీరంశెట్టి సీతారాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకం జైపాల్, జిల్లా కాంగ్రెస్ మెడికల్ అండ్ హెల్త్ అధ్యక్షులు డాక్టర్ మురళీకృష్ణ, కౌన్సిలర్లు పణితి సైదులు, బత్తుల సుమతి, ఉండ్రు శ్యాంబాబు, ధర్నా రాజశేఖర్, మచ్చ బుజ్జి, పొదిల హరినాథ్, చెరుకూరి కిరణ్, వీరయ్య, మేడూరి రామారావు, బిడికి రత్నం తదితర కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News