- District News
- విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులకీలకం
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులకీలకం
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
సెప్టెంబర్ 5 (లోకల్ గైడ్ )
విద్యార్థుల భవిష్యత్తును తరగతి గదిలో తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని పురస్కరించుకొని జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను, విద్యార్థులచే వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ఏ ఉద్యోగికి దక్కని గౌరవం కేవలం ఉపాధ్యాయునికే దక్కుతుందన్నారు. ప్రతి విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు క్రమశిక్షణ, కష్టపడి, చదవడం, మంచి విలువలను నేర్పడం, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉపాధ్యాయులు, విద్యాబోధన చేస్తారని అన్నారు. గురువుల సేవలను గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజున ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడంలో ముందుండాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెం పెంపొందించేలా పలు కార్యక్రమాలను నిర్వహించగా, విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి అధ్యంతం ఆనంద ఉత్సవాల మధ్య ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థుల ప్రసంగాలు పాటలకు అనుగుణంగా చేసిన నృత్యాలు అధ్యంతం ఆసక్తిగా సాగాయి, ఉపాధ్యాయులకు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
