నారాయణ పాఠశాల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

Published On
నారాయణ పాఠశాల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

ఖమ్మం: లోకల్ గైడ్:
ఖమ్మం: నారాయణ పాఠశాల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి . ఈ కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ శ్రీ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను కూడా అలవర్చుకోవాలని సూచించారు . వినాయకుడు జ్ఞానానికి , విజయానికి ప్రతీక అని , విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో ఏ.జీ.ఎం.యస్ రాంకీ , ఆర్‌.ఐ క్రాంతి కుమార్ పాఠశాల ప్రిన్సిపల్ జి.నవీన్ కుమార్ , ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు . గణపతి మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తిమయ వాతావరణంలో పూజలు నిర్వహించారు .
చివరిగా అందరూ గణపతి బప్పా మోరియా నినాదాలతో స్వామివారి ఆశీస్సులు పొందారు . విద్యార్థుల విద్యాభివృద్ధి , సంస్థ ప్రగతి మరియు సమాజ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు .

Tags:

About The Author

Latest News