- District News
- Warangal
- మార్నేని వర్సెస్ కేఆర్.. వర్ధన్నపేట కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు!
మార్నేని వర్సెస్ కేఆర్.. వర్ధన్నపేట కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు!
(లోకల్ గైడ్ న్యూస్):
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఐనవోలు మండలానికి చెందిన మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుపై కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ, ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మార్నేని రవీందర్‌రావుపై కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా విమర్శలు చేయడం నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరినట్లు తెలుస్తోంది.అయితే ఈ ప్రెస్‌మీట్ వెనుక వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హస్తం ఉందని మార్నేని వర్గం ఆరోపిస్తోంది. దీంతో ఇప్పటికే ఉన్న విభేదాలు మరింత ముదిరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకే పార్టీలోని ముఖ్య నాయకుల మధ్య బహిరంగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
మార్నేని వర్సెస్ కేఆర్ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో...కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
