లేక్ష్యశ్రీ ప్రతిభ ఆదర్శనీయం

ఆమెను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలి : కొమరం భీం నిలయ కార్యదర్శి మురళీకృష్ణ

Published On
లేక్ష్యశ్రీ ప్రతిభ ఆదర్శనీయం

 

 

చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
చర్లకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని నంబూరి లేక్ష్యశ్రీ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సాధించిన సందర్భంగా శనివారం వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో లేక్ష్యశ్రీని శాలువాతో ఘనంగా సత్కరించారు. నిలయ కమిటీ ఉపాధ్యక్షుడు గోగికార్ రాంలక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మురళీకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్న వయసులోనే లేక్ష్యశ్రీ ఇంతటి ఘనత సాధించడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించి ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. మన్యం ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి తొలిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం అందరికీ గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరెంతో మంది విద్యార్థులు లేక్ష్యశ్రీ స్ఫూర్తితో ప్రతిభ కనబరిచి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. లేక్ష్యశ్రీలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేసిన కరాటే శిక్షకులు ముత్తు, రాహుల్‌తో పాటు విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. తల్లిదండ్రులు నంబూరి శ్రీనివాసరావు, అశ్వని దంపతులు తమ కుమార్తెను మరింతగా ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిలయ కమిటీ సహ కోశాధికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, నిలయ ప్రముఖులు వరలక్ష్మి, సంతోష్, ముఖేష్, గాదంశెట్టి ప్రసన్నలక్ష్మి, గాదంశెట్టి సుధారాణి, నంబూరి అశ్వని, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News