- District News
- Khammam
- ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, ఆగస్టు- 17: లోకల్ గైడ్:
:
ప్రజావాణిలో తమ సమస్యలు తెలుపుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు.
రఘునాధపాలెం మండలం పాపటపల్లి గ్రామానికి చెందిన చౌడవరపు దుర్గమ్మ తన కుమారుడు తనను అనేక బాధలు పెడుతున్నారని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా సంక్షేమ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కల్లూరు మండలం ఓబులరావు బంజర గ్రామానికి చెందిన భూక్యా మురళీ తాను శారీరకంగా దివ్యాంగుడినని తాను డిగ్రీ బీకాం కంప్యూటర్ చదివానని తనకు ఏదైనా ప్రభుత్వ శాఖలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఉపాధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కొణిజర్ల మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన రైతులు సర్వేనెంబర్ 19 లో తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వ్యవసాయం సాగు చేసుకుంటున్నామని, సర్వే నెంబర్ 19 అటవీ భూమికి సరిహద్దున ఉన్నందున పట్టా పాస్ పుస్తకాలు రాలేదని, 1950 మ్యాపు ప్రకారం తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ సభ్యులు తమకు నాలుగు నెలలుగా పెండింగ్ ఉన్న జీతాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఎస్ ఈ మిషన్ భగీరథకు రాస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన కే. ఉపేందర్ తాను రెండు సంవత్సరాలుగా ర్యాపిడో బైక్ నడుపుకుంటున్నాని, ఎస్సీ కార్పొరేషన్ లో ఆటో కొరకు దరఖాస్తు చేసుకున్నానని చాలా పేదరికంలో ఉన్నానని తనకు ఆటో ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారికి రాస్తూ పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈవో దీక్షా రైనా, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
.
