గ్రామాభివృద్ధికి గ్రామసభే గ్రీన్ సిగ్నల్!

వికాసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై ఎంపీడీవో పద్మ వెల్లడి

Published On
గ్రామాభివృద్ధికి గ్రామసభే గ్రీన్ సిగ్నల్!

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 28 (లోకల్ గైడ్ న్యూస్):

వీబీజీ రామ్‌జీ కింద చేపట్టనున్న వికాసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలో గుర్తించే అభివృద్ధి పనులకు గ్రామసభ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని ఎంపీడీవో పద్మ తెలిపారు. సింగరేణి మండలంలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అవసరాలు, సమస్యలు, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి అభివృద్ధి ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగా సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌లను సిద్ధం చేసి సహజ వనరులు, మౌలిక వసతులు, ప్రజల అవసరాలను గుర్తించాలన్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, నీటిపారుదల తదితర శాఖల ద్వారా చేపట్టగల పనులను పరిశీలించి, గ్రామానికి ఉపయోగకరమైన వాటిని ప్రణాళికలో చేర్చాలని సూచించారు. సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్స్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గుర్తించిన పనుల వివరాలను సిద్ధం చేసి అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభలో ప్రవేశపెట్టాలని, గ్రామసభ ఆమోదం పొందిన పనులనే ప్రణాళికలో చేర్చాలని ఎంపీడీవో పద్మ స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News