- District News
- Warangal
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వాక్ ఫర్ ఎ హెల్తియర్ హార్ట్ నిర్వహించిన వరంగల్ మెడికవర్ హాస్పిటల్ వైద్యుల...
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వాక్ ఫర్ ఎ హెల్తియర్ హార్ట్ నిర్వహించిన వరంగల్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు
గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించిన వైద్య నిపుణులు- వాకథాన్,జుంబా కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం
Published On
By Ram Reddy
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్29
(లోకల్ గైడ్ న్యూస్)
ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ నుంచి భద్రకాళి బండ్ (ట్యాంక్ బండ్) వరకు వరల్డ్ హార్ట్ డే వాకథాన్ నిర్వహించారు.ప్రజలు నిత్య జీవితంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.
కార్యక్రమంలో భాగంగా గుండె ఆరోగ్యంపై నిపుణుల అవగాహన సదస్సుతో పాటు జుంబా డాన్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
దీంతో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ గుండె జబ్బుల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన పొందారు.
ఈ అవగాహన కార్యక్రమానికి మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ సీనియర్ కార్డియాలజీ నిపుణులు డా. సంతోష్ మోహన్‌లాల్ మోదాని, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్; డా. శ్రవణ్ కుమార్ రాంపెల్లి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్; డా. షఫీ పాలగిరి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గుండె సంబంధిత హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ప్రాథమిక సీపీఆర్ విధానాలను నేర్చుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.డా. షఫీ పాలగిరి మాట్లాడుతూ, “గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.ఆరోగ్యకరమైన జీవనశైలితోనే గుండె జబ్బులను చాలా వరకు నివారించవచ్చు” అని తెలియజేశారు.
Tags:
