- District News
- ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
Published On
By Ram Reddy
వనపర్తి పట్టణంలోని 22వ వార్డుకు చెందిన ఇఫ్తికార్ అహ్మద్ అనారోగ్యంతో గాంధీ చౌక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ఆస్పత్రికి వెళ్లి ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇఫ్తికార్ అహ్మద్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇఫ్తికార్ అహ్మద్ ను పరామర్శించిన వారిలో గ ట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, గంధం పరంజ్యోతి, వెంకట్ సాగర్, రహీం, జోహేబ్ హుస్సేన్, అస్లాం, జబ్బార్, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
28 Sep 2026 21:13:06
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
