ప్రజల పక్షాన ప్రశ్నించిన రాహుల్‌పై కేసా..? బీజేపీ తీరుపై హర్ష నాయక్ ఆగ్రహం

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి: యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుగులోత్ హర్ష నాయక్

Published On
ప్రజల పక్షాన ప్రశ్నించిన రాహుల్‌పై కేసా..? బీజేపీ తీరుపై హర్ష నాయక్ ఆగ్రహం

 

 

కారేపల్లి : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1:

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని సింగరేణి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుగులోత్ హర్ష నాయక్ తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవం వంటి అంశాలపై ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభ అనంతరం జరిగిన ‘శుద్ధీకరణ’ ఘటనపై ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం సరైన నిర్ణయం కాదని హర్ష నాయక్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేసులు, ఎఫ్‌ఐఆర్‌లతో రాహుల్ గాంధీని భయపెట్టాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తే అది భ్రమేనని హర్ష నాయక్ స్పష్టం చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతును కేసులతో అణిచివేయలేరని అన్నారు. “రాహుల్ గాంధీ ఒక్కరిపై కేసు కాదు.. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుపై దాడి” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ భయపడదని, బెదరదని, వెనక్కి తగ్గదని హర్ష నాయక్ స్పష్టం చేశారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక అసమానతలు, దళితులపై జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని గుగులోత్ హర్ష నాయక్ తెలిపారు.

Tags:

About The Author

Latest News