బాల్య వివాహాల రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దాలి: కలెక్టర్ కె. హైమావతి

అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేయాలి

బాల్య వివాహాల సమాచారం అందిన వెంటనే సత్వర చర్యలు. పాఠశాలల్లో బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించాలి.
Published On
బాల్య వివాహాల రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దాలి: కలెక్టర్ కె. హైమావతి

IMG-20260818-WA0069(1)సిద్దిపేట, ఆగస్టు 18(లోకల్ గైడ్):

సిద్దిపేట జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు.మంగళవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమలుపై సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందితే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా సర్పంచులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఫంక్షన్ హాళ్లు, దేవాలయాల్లో వివాహాల సందర్భంగా వధూవరుల వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించేలా చర్యలు చేపట్టాలని డీపీఓను ఆదేశించారు.గ్రామ స్థాయిలో బాల్య వివాహాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీపీలు, సర్పంచులు సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు.పాఠశాలల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరు కాకపోతే, వారు పాఠశాలకు ఎందుకు రావడం లేదనే విషయాన్ని ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని డీఈఓకు సూచించారు. బాల్య వివాహాలకు ఆర్థిక సమస్యలు కూడా కారణమవుతున్నందున, సంబంధిత శాఖలు కుటుంబాలకు ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు అందించే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు.గ్రామ స్థాయిలో బాల్య వివాహాల నిరోధక కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించాలని సూచించారు. మంగళ, గురువారాల్లో నిర్వహించే శానిటేషన్ డ్రైవ్‌లలో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కల్పించాలని తెలిపారు.ప్రతి పాఠశాలలో బాల్య వివాహాల నిరోధక చట్టం–2006తో పాటు పిల్లల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.రిసోర్స్ పర్సన్ అందె వెంకటేశ్వర్లు బాల్య వివాహాల నిరోధక చట్టం–2006పై అధికారులకు సవివరంగా అవగాహన కల్పించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై రూపొందించిన వాయిస్ ఓవర్, వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బందితో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రమేష్, డీఆర్వో నాగరాజమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధనరాజ్, జిల్లా సంక్షేమ అధికారి శారద, డీపీఓ రవీందర్, రిసోర్స్ పర్సన్ అందె వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం పెద్దపీట
కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు 
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్,ఆపే కుట్రను సహించం: జోగు రామన్న
బాల్య వివాహాల రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దాలి: కలెక్టర్ కె. హైమావతి
సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. 
ప్రజా పాలన కాదు  ప్రతికార పాలన
సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మిక హక్కులకై పోరాడుదాం.
గురుకులాన్ని ఏటూరునాగారం తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన... ఏ ఎన్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్..