తుక్కుగూడలోని హాస్పిటల్లో నర్స్ దారుణ హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్. 

మాటువేసి కాటువేసిన కామాంధుడు మహమ్మద్ సనా ఉల్లా. బీహార్ కు చెందిన సనాఉల్లా 3 నెలలుగా బైక్ మెకానిక్ గా పనిచేస్తూన్నాడు.                                                        

ఘటన జరిగిన 30 గంటల్లోపు నిందితుణ్ణి అదుపులో కి తీసుకొన్న ప్రత్యేక పోలీసు బృందాలు.                    
Published On
తుక్కుగూడలోని హాస్పిటల్లో నర్స్ దారుణ హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్. 



    రంగారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్టు 31, ( లోకల్ గైడ్ ):                         తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ నర్స్ పై లైంగిక దాడి, ఆపై హత్యాచేసిన నిందితుణ్ణి హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన పై శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ కేసు వివరాలను వెల్లడించారు. అనుమానస్పదస్థితిలో దారుణ హత్యకు గురైన నర్స్ శిరీష మర్డర్ కేసును పోలీసులు చేదించారు. బీహార్ కు చెందిన మహమ్మద్ సనా ఉల్లా (34) మూడేళ్ళ క్రితం బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. అయితే పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కనేఉన్న బైక్ షాప్ లో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కాగా పక్కనే ఉన్న ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చోటిగూడ కు చెందిన శిరీష (23) ఏళ్ల యువతి నర్స్ గా పనిచేస్తుంది. అయితే నిందితుడికి తన ఫోన్ లో అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలో తన కామ వాంఛతో హాస్పిటల్ నర్సుగా పనిచేసే శిరీష పై కన్ను పడింది. అప్పుడప్పుడు హాస్పిటల్ లోకి వెళ్లి శిరీషను గమనించేవాడు. దీంతో ఆమెపై ఎలాగైనా సరే కామ వాంఛన తీసుకోవాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 29వ తేదీన శిరీష తన హాస్టల్ గదిలో నిద్రస్తుండగా సనాఉల్లా కిటికీలో నుంచి ఆమె గదిలోకి చొరబడ్డాడు. ఆ గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న శిరీష భయంతో కేకలు వేసేందుకు ప్రయత్నించగా నిందితుడు ఆమె నోరు మూసీ గోడకేసి లాగాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమె లైంగిక దాడికి పాల్పడ్డాడు . అనంతరం ఆమెను గొంతు నులిమి హత్య వచ్చిన దారిలో ( కిటికీ ) నుంచి పారిపోయాడు. ఉదయం శిరీష ఎవరూ ఫోన్ చేసిన ఎత్తకపోవడంతో పాటు తలుపు తీయలేదు.  అనుమానం ఓ నర్స్ కిటికీలో నుంచి చూడగా శిరీష గదిలో విఘతజీవిగా పడిఉండటంతో ఆసుపత్రి నిర్వాహకులకు తెలిపింది.హాస్పిటల్ మేనేజర్ వెంటనే పహాడి షరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. విషయాన్ని తెలుసుకున్న పహాడీ షరీఫ్  పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని  పరిస్థితిని పూర్తిస్థాయిలో పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చి కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డిసిపి తెలిపారు. చేదించేందుకు 5 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపి సీసీ కెమెరాలు, క్లూస్ టీం సిబ్బంది ఈ గంటకు సంబందించిన పూర్తి ఆధారాలను సేకరించగా బైక్ మెకానిక్ సనా ఉల్లా నిందితుడిగా తెలిచారు. ఈ ఘోరానికి పాల్పడిన సనా ఉల్లా తనకు ఏమీ తెలియనట్లు మెకానిక్ షాప్ లోనే పనిచేస్తూ ఉన్నాడు. అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన చలిలో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ముందుగా హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి ఆధారాల సేకరించి అనంతరం అత్యాచారం ఆపై హత్య జరిగినట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు.  పహాడీ షరీఫ్ పోలీసులతోపాటు  శంషాబాద్ డిసిపి రాజేష్ ఏసిపి శ్రీకాంత్ గౌడ్ సంఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించి కేసు దర్యాప్తు చేసినట్లు డిసిపి రాజేష్ తెలిపారు.

Tags:

About The Author

Latest News