- District News
- ఉత్తమ అవార్డులు అందుకున్న చర్ల ఎంపీడీవో ఈదయ్య , తహసీల్దార్ శ్రీనివాస్ కు ఘన సన్మానం
ఉత్తమ అవార్డులు అందుకున్న చర్ల ఎంపీడీవో ఈదయ్య , తహసీల్దార్ శ్రీనివాస్ కు ఘన సన్మానం
Published On
By Ram Reddy
ఉత్తమ ఎంపీడీఓగా, ఉత్తమ ఏఈఆర్‌ఓగా అవార్డులు అందుకున్న చర్ల మండల అధికారులను తుడుందెబ్బ బృందం ఘనంగా సన్మానించింది. సోమవారం చర్ల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చర్ల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉత్తమ ఎంపీడీఓ అవార్డు అందుకున్న సందర్భంగా తుడుందెబ్బ నాయకులు ఎంపీడీఓను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. చర్ల తహసీల్దార్ ఉత్తమ ఏఈఆర్‌ఓగా అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను కూడా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు వాసం ముసలయ్య మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకోవడం చర్ల మండల ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించే అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో ఉండటం అభినందనీయమని అన్నారు. చర్ల ఎంపీడీఓకు ఉత్తమ ఎంపీడీఓ అవార్డు రావడం, తహసీల్దార్‌కు ఉత్తమ ఏఈఆర్‌ఓ అవార్డు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఎంపీడీఓ, తహసీల్దార్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్, తుడుందెబ్బ సీనియర్ నాయకులు తాటి వెంకటరావు, మండల యువ నాయకులు పూనెం రవికిరణ్, పురిటి ప్రశాంత్, ఇర్ప అరుణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
31 Aug 2026 09:25:53
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
