ఆమనగల్లు లో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

భక్తిశ్రద్ధల తో అమ్మవారికి బోనాల సమర్పణ

పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు
Published On
ఆమనగల్లు లో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

 

 

 

ఆమనగల్లు, సెప్టెంబర్ 1 (లోకల్ గైడ్ ఆమనగల్లు):
ఆమనగల్లు పట్టణంలో మాల కుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.IMG-20260901-WA0046

ఈ బోనాల ఉత్సవాలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, వైస్ చైర్‌పర్సన్ తల్లోజు గీత ఆచారి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ఉత్సవాలను తిలకించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎనమల్ల రమేష్, మొక్తల వెంకటయ్య, ఎర్రవోలు మహేష్, ఆంజనేయులు యాదవ్, నాగిళ్ల జగన్, అనూష శ్రీశైలం, సర్పంచ్ మండ్లి రాములు, మాజీ కౌన్సిలర్ చెన్నకేశవులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వస్పుల మానయ్య, పూసల సత్యం, మున్సిపల్ అధ్యక్షుడు అవ్వారి శివలింగం, మెకానిక్, బాబా తదితరులు పాల్గొన్నారు.

అలాగే కుల సంఘాల నాయకులు కాలే మల్లయ్య, గోరటి నర్సింహా, దేవేందర్, చంద్రయ్య, మల్లేష్, సతీష్, మల్లయ్య, నర్సింహా, వడ్డేమోని శివకుమార్, భరత్, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

పోచమ్మ బోనాల సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:

About The Author

Latest News