మాదారం ప్రజల వైద్యుడిగా.. గ్రామీణ వైద్యుల సంఘం ఆప్తుడిగా

పుల్లారావు కుటుంబానికి సింగరేణి మండల గ్రామీణ వైద్యుల సహాయక సంఘం రూ.40 వేల ఆర్థిక సహాయం

Published On
మాదారం ప్రజల వైద్యుడిగా.. గ్రామీణ వైద్యుల సంఘం ఆప్తుడిగా

 

IMG-20260930-WA0198

కారేపల్లి, సెప్టెంబర్ 30 (లోకల్ గైడ్ న్యూస్) :

కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు పుల్లారావు మృతితో ఆయన కుటుంబానికి సింగరేణి మండల గ్రామీణ వైద్యుల సహాయక సంఘం అండగా నిలిచింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామంలో బుధవారం నిర్వహించిన పుల్లారావు సంస్మరణ సభలో ఆయన కుటుంబ సభ్యులకు సంఘం తరఫున రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అంతకుముందు పుల్లారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాదారం గ్రామంలో సుమారు రెండు దశాబ్దాల పాటు గ్రామీణ వైద్యుడిగా పుల్లారావు అందించిన సేవలను గ్రామస్తులు స్మరించుకున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలిచేవారని తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్య అవసరాలకు స్పందిస్తూ చేసిన సేవలతో మాదారం ప్రజలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందన్నారు. అదేవిధంగా సింగరేణి మండల గ్రామీణ వైద్యుల సహాయక సంఘంతో పుల్లారావుకు ఉన్న అనుబంధాన్ని తోటి వైద్యులు గుర్తు చేసుకున్నారు. సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, సహచర గ్రామీణ వైద్యులకు అవసరమైన సమయంలో సహకారం అందించేవారని తెలిపారు. గ్రామీణ వైద్యుల ఐక్యత, పరస్పర సహకారం కోసం ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. సంఘం సింగరేణి మండల అధ్యక్షుడు గండమల వెంకటేశ్వర్లు, కార్యదర్శి చిలువేరు రమేశ్ మాట్లాడుతూ పుల్లారావు అకాల మృతి గ్రామీణ వైద్యుల కుటుంబానికి తీరని లోటని అన్నారు. స్నేహితుడిగా, సహచర వైద్యుడిగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాదారం ప్రజలకు అందించిన వైద్య సేవలు, గ్రామీణ వైద్యుల సహాయక సంఘానికి అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. పుల్లారావు కుటుంబానికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మాదారం సర్పంచ్ అజ్మీరా ఉమానరేష్ పుల్లారావు దశదిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుల్లారావుతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా మాదారం గ్రామ ప్రజలకు పుల్లారావు అందించిన వైద్య సేవలు మరువలేనివని అన్నారు. ఆయన మంచితనం, సేవాభావం గ్రామ ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల గ్రామీణ వైద్యులు, మాదారం గ్రామ ప్రజలు, పుల్లారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ
        కారేపల్లి, అక్టోబర్ 11 (లోకల్ గైడ్ న్యూస్): దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రుల సందర్భంగా కారేపల్లి మండలం గోవిందుతండా గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి
ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన మంత్రి సీతక్క
ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు
అమెరికాసామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి.
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ' కూటమి ఘన విజయం
సి సి రోడ్డు శంకుస్థాపన చేసిన సర్పంచ్ ఖమ్మంపాటి స్వాతి జగన్  
సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.