- District News
- Khammam
- పట్టభద్రులారా.. ఓటరుగా నమోదు చేసుకోండి
పట్టభద్రులారా.. ఓటరుగా నమోదు చేసుకోండి
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు పిలుపు
సింగరేణి, సెప్టెంబర్ 29 (లోకల్ గైడ్ న్యూస్):
ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సింగరేణి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు పిలుపునిచ్చారు. పట్టభద్ర ఓటర్ల నూతన నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అర్హులు నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 8, 2026 వరకు పట్టభద్ర ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్లలో ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, సెల్‌ఫోన్ నంబర్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు గడువు ముగిసేలోపు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రాంబాబు కోరారు.
