- District News
- ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి
ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి
Published On
By Ram Reddy
భద్రాచలం ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో సెప్టెంబర్ 28న సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్, ప్రజావాణి కార్యక్రమాలకు అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు, డివిజన్ అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తెలిపారు. గిరిజనులు, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులను అందజేయాలని వారు సూచించారు. సంబంధిత యూనిట్ అధికారులు, డివిజన్ అధికారులు ఉదయం 10.30 గంటలకు భద్రాచలం ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లోని సమావేశ మందిరాలకు తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Oct 2026 14:55:06
మాజీ సర్పంచ్ సుందరి అనిల్ పై సంచలన ఆరోపణలు
