- District News
- Khammam
- పేదల సమస్యలపై కొండబోయిన నాగేశ్వరరావు గర్జన
పేదల సమస్యలపై కొండబోయిన నాగేశ్వరరావు గర్జన
విద్య, వైద్యం నుంచి పోడు భూములు, ఉపాధి హామీ వరకు సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశంలో నివేదిక
కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 19 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం, వైరా నియోజకవర్గ పరిధిలో పేదలు, కూలీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కొండబోయిన నాగేశ్వరరావు రాష్ట్ర కమిటీ సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఆయన సమగ్ర నివేదికను సమర్పించారు. విద్య, వైద్యం, కూలీల సమస్యలు, భూమి, పోడు రైతుల సమస్యలు, ఉపాధి హామీ పనులు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కొండబోయిన నాగేశ్వరరావు వివరించారు. పోడు రైతుల భూముల సమస్యలకు పరిష్కారం, కూలీలకు నిరంతర ఉపాధి, అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని ఆయన నివేదికలో ప్రస్తావించారు. సింగరేణి మండలం, వైరా నియోజకవర్గ ప్రజల సమస్యలను రాష్ట్ర స్థాయిలో చర్చకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
