ముందు హామీలు అమలు చేయండి..

ఆ తర్వాతే రాజీనామాల మాట : చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు

Published On
ముందు హామీలు అమలు చేయండి..

 

చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1000 రోజులు అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శనివారం చర్ల పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ మండల కమిటీ నాయకులు ఇంటింటికీ తిరిగి ‘బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటి అమలును పట్టించుకోవడం లేదన్నారు. పాలన చేతకాక ప్రతిపక్ష నాయకులు రాజీనామా చేయాలని అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసినందుకు ముందుగా అధికార పార్టీ నాయకులే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్, యువజన విభాగం నాయకులు కాకి అనిల్, అంబోజి సతీష్, గోరింట్ల వెంకటేశ్వరరావు, వార్డు సభ్యుడు కట్టం కన్నారావు, గాదంశెట్టి కిశోర్, తడికల బుల్లేబాయ్, పసికంటి సంతోష్ తదితరులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News