- District News
- Nalgonda
- ఎండుతున్న వరి ఆందోళనలో రైతన్నలు
ఎండుతున్న వరి ఆందోళనలో రైతన్నలు
ప్రభుత్వం ఆదుకోవాలి.
* --
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్ .
ఎల్ నీనో ప్రభావంతో అడుగంటిన భూగర్భ జలాలు బోర్లు పోయాక రైతులు వేసిన పంటలో డెబ్బై శాతం పంట ఇప్పటికే పూర్తిగా ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంట పొలాలకు అంచనా వేసి ఆర్థిక వ్యయాన్ని ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నలగొండ మండలంలోని రసుల్పురం గ్రామంలోని ఎండిపోయిన పంట పొలాలను రైతు సంఘం బృందం పరిశీలించారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏ ఎం ఆర్ పి కాలువ ద్వారా డిస్ట్రిబ్యూటరీ 37 క్రింద ఉన్న గ్రామాల చెరువులను, కుంటలను వెంటనే నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోర్లు పోయడంతో కొంత పంటలను కాపాడుకోవచ్చని , పశువులకు గొర్రెలకు మేకలకు పక్షులకు జీవనాధారమ్ అవుతాయని తెలిపారు.
కృష్ణా జలాలతో నింపి ప్రజల కష్టాలను తీర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు సయ్యద్ హసీమ్, నలపరాజు సైదులు, మండల కార్యదర్శి దొండ కృష్ణారెడ్డి మండల నాయకులు బొల్లు రవీందర్, పగిళ్ల సైదులు, గుండెబోయిన జానయ్య తదితరులు పాల్గొన్నారు.
