ముసాయిదా ఓటరు జాబితా లోని ఓటర్లందరూ తుది జాబితా లో వుండే లక్ష్యంగా చర్యలు... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

1,75,858 మంది ఓటర్లకు ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారుల ద్వారా నోటీసులు

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం
Published On
ముసాయిదా ఓటరు జాబితా లోని ఓటర్లందరూ తుది జాబితా లో వుండే లక్ష్యంగా చర్యలు... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం, సెప్టెంబర్-5: లోకల్ గైడ్:

ముసాయిదా ఓటర్ల జాబితా లో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు పొందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇఆర్ఓ లతో కలిసి శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, నోటీసుల జారీలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో గుర్తించిన అనామలీస్‌, మ్యాపింగ్‌ లేని ఓటర్ల వివరాలు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 17న ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు, మ్యాపింగ్ లేని, అనామాలీస్ ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో మొత్తం  10,85,927 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైందని, ఇందులో 1,75,858 మంది మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లకు నోటీసులు జారీచేయనుండగా, ఇప్పటివరకు 1,75,841 నోటీసులు జనరేట్ చేసి, 1,32,817 మందికి నోటీసులు అందజేశామన్నారు.  నోటీసుల ప్రకారం 14,680 మంది ఓటర్ల హియరింగ్ ప్రక్రియ పూర్తిచేశామన్నారు.

నోటీసులు అందుకున్న వారు సంబంధిత పత్రాలు సమర్పించాలి.
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ ఆధారంగా భారత ఎన్నికల సంఘం సూచించిన పత్రాల్లో సంబంధిత పత్రాలను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. పేర్ల అసంబద్ధత వున్న వారు ధృవీకరణలు సమర్పించకున్న, సంబంధిత బూత్ లెవల్ అధికారులు పంచనామా చేసి ధృవీకరిస్తారన్నారు. 

అర్హులైన కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చు
ప్రస్తుతం కూడా అర్హులైన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 2026 అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఏ శాసనసభ నియోజక వర్గంలోనూ ఓటరుగా నమోదు కాకపోతే ఫారమ్‌-6 ద్వారా తాజా ఫొటో, వయస్సు ధృవీకరణ పత్రం, డిక్లరేషన్‌ తదితరాలను జతచేసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

అక్టోబర్‌ 19న తుది ఓటర్ల జాబితా
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 19, 2026న   ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పరిధిలోని ఓటర్లకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా తుది జాబితాలో నమోదు అయ్యేలా సహకరించాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాల కోసం బూత్‌ స్థాయి అధికారి, సహాయ ఎన్నికల నమోదు అధికారి, ఎన్నికల నమోదు అధికారులను సంప్రదించవచ్చని, అలాగే టోల్‌ఫ్రీ 1950కు ఫోన్‌ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎస్డిసి సదానందం, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాజు, డిటి అన్సారీ, బీ.ఆర్‌.ఎస్. పార్టీ ప్రతినిధి ఎం.రమేష్,  బీజేపీ ప్రతినిధి వి.రాజేష్, సిపిఐ(ఎం) ప్రతినిధి డి.తిరుపతి రావు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి స్వర్ణ సుబ్బారావు,  కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏ.గోపాల రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
        చర్ల : లోకల్ గైడ్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం మండల పరిషత్ పాఠశాలలో మండల స్థాయి క్రీడా కార్యక్రమాలను
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు 
పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం
డైస్,యు పి ఎచ్ సి, ఎస్ ఎన్ సి యు, ఎన్ ఆర్ సి ల సేవలపై డి ఎం ఎచ్ ఓ తనికి.
శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో గుండ్లగడ్డ కిష్టబావి అన్న ప్రసాదవితరణ 
17 డిమాండ్ల సాధనకు రిలే నిరాహార దీక్ష