- District News
- విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి.
Published On
By Ram Reddy
---
అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు వారిలో క్రమశిక్షణ, విలువలు, సామాజిక బాధ్యత, నైతికత వంటి లక్షణాలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒక విద్యార్థి జీవితంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో ప్రభావం చూపుతుందని తెలిపారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజ అభివృద్ధికి బాటలు వేస్తున్న ఉపాధ్యాయుల సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్పోర్ట్స్ స్కూల్స్ వంటి విద్యా సంస్థలు అందుబాటులోకి రావడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడా రంగంలో ప్రతిభను వెలికితీసే అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులలో నాణ్యమైన విద్యను పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందిస్తున్న 55 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను గుర్తించి సన్మానించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహం, బాధ్యత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, సీఎంఓ ప్రతాప్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.-
Tags:
About The Author
Related Posts
Latest News
19 Sep 2026 10:51:40
శంషాబాద్:సెప్టెంబర్19( లోకల్ గైడ్ ప్రతినిధి)
శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల గ్రామం వద్ద శనివారం ఉదయం 6 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి
