- District News
- Nalgonda
- రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల అరెస్ట్ ను నిరసిస్తూ అమిత్ షా, సిఇసి జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం...
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల అరెస్ట్ ను నిరసిస్తూ అమిత్ షా, సిఇసి జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం.
Published On
By Ram Reddy
ఎన్ ఎస్ యు ఐ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాదవల్లి వెంకటస్వామి పిలుపు మేరకు, ఎన్ ఎస్ యు ఐ నల్గొండ జిల్లా అధ్యక్షుడు అల్లి అంజన్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల ను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సిఇసి జ్ఞానేశ్ కుమార్ ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
జిల్లా అధ్యక్షుడు అల్లి అంజన్ యాదవ్ మాట్లాడుతూ సర్, ఓటర్ల జాబితా పై శాంతియుత నిరసన చేస్తున్న రాహుల్ గాంధీ ని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. సర్ లో పారదర్శకత ఉండాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బైరు ప్రసాద్ గౌడ్, జిల్లా నాయకులు సాయి తేజ,అనుముల పురి గొయల్, సూర్య, చిట్టీ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
23 Oct 2026 10:04:54
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .
పేదలు, అణగారిన వర్గాల పక్షాన నిలిచి, భూస్వాములు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు
