- District News
- Khammam
- గోవిందుతండాలో గాయత్రి దేవికి భక్తి కానుక.. 10 చీరల విరాళం!
గోవిందుతండాలో గాయత్రి దేవికి భక్తి కానుక.. 10 చీరల విరాళం!
అమ్మవారి పది రోజుల అలంకరణకు బానోత్ లచ్చిరామ్–బుజ్జి దంపతులు, కుమారుడు అశోక్ ఉదార సమర్పణ
కారేపల్లి, అక్టోబర్ 12 (లోకల్ గైడ్ న్యూస్):
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ గోవిందుతండాకు చెందిన బానోత్ లచ్చిరామ్–బుజ్జి దంపతులు, వారి కుమారుడు అశోక్ శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ కోసం 10 చీరలను విరాళంగా అందజేశారు. అమ్మవారి పది రోజుల అలంకరణకు సరిపడా చీరలను సమర్పించి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. కారేపల్లి మండలం మాదారం గ్రామపంచాయతీ పరిధిలోని గోవిందుతండాలో కొలువైన శ్రీ గాయత్రి దేవి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బానోత్ లచ్చిరామ్–బుజ్జి దంపతులు, వారి కుమారుడు అశోక్ అమ్మవారికి 10 చీరలను భక్తిపూర్వకంగా సమర్పించారు. పది రోజుల అలంకరణకు 10 చీరలను విరాళంగా అందించడం అమ్మవారిపై వారి భక్తికి నిదర్శనంగా నిలిచింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి అలంకరణకు సహకరించిన దాతల కుటుంబంపై గ్రామస్థులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బానోత్ లచ్చిరామ్–బుజ్జి దంపతులు, వారి కుమారుడు అశోక్ కుటుంబానికి శ్రీ గాయత్రి దేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గోవిందుతండా అమ్మ భవాని యూత్ సభ్యులు ఆకాంక్షించారు.
