ప్రశ్నిస్తే లాఠీలేనా? బీజేపీని నిలదీసిన గుడిపూడి తిరుమల రావు

రఘురామిరెడ్డిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్‌ నాయకుడు

Published On
ప్రశ్నిస్తే లాఠీలేనా? బీజేపీని నిలదీసిన గుడిపూడి తిరుమల రావు

 

 

కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్):

ఓటు చోరీ ఆరోపణలపై ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన పోరాటానికి మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్‌ చేయడాన్ని కాంగ్రెస్‌ నాయకుడు గుడిపూడి తిరుమల రావు తీవ్రంగా ఖండించారు. రాహుల్‌ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రఘురామిరెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తుండగా పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం దారుణమని ఆయన అన్నారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధుల గొంతు నొక్కే ప్రయత్నాలను కాంగ్రెస్‌ సహించదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచి అధికారాన్ని కాపాడుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని గుడిపూడి తిరుమల రావు అన్నారు. ఓటు చోరీ ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది పోయి, ప్రశ్నించే వారిపై పోలీసు చర్యలకు దిగడం బీజేపీ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్‌ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని, కేంద్రంతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్‌ మరింత బలపడుతుందని గుడిపూడి తిరుమల రావు అన్నారు.

Tags:

About The Author

Latest News

ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం  ఓటు హక్కుపై కోతను సహించం: సీపీఎం 
        కారేపల్లి, అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్): ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన పేరుతో అర్హులైన ఓట్ల తొలగింపును నిలిపివేయాలని సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ
డీసీసీ అధ్యక్షుడితో సామ రామ్మోహన్ రెడ్డి భేటీ.
ప్రశ్నిస్తే లాఠీలేనా? బీజేపీని నిలదీసిన గుడిపూడి తిరుమల రావు
మూడు నెలలుగా నిలిచిన 'భగీరథ'.. 
జోరుగా ఇసుక అక్రమ రవాణా!
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలి, 
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్