- District News
- Nalgonda
- గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో నల్గొండ ఎంపీడీవో కు వినతి .
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో నల్గొండ ఎంపీడీవో కు వినతి .
సోమవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ప్రజావాణిలో నల్గొండ మండలంలో గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కళ్ళు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న నల్గొండ ఎంపీడీవో కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కొండా వెంకన్న మాట్లాడుతూ
గీత కార్మికులకు పెన్షన్లు రాక ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న, వాటిని పరిష్కరించాలని , అర్హత కలిగిన ప్రతి కల్లుగీత కార్మికునికి పెన్షన్ మంజూరు చేయాలని . పి ఎఫ్ టి ఉన్న దగ్గర లైసెన్స్ పెడితే సరిపోతుందని టి సి ఎస్ దగ్గర ఐడెంటి కార్డు జిరాక్స్ ఇస్తే సరిపోతుందని అని స్థానిక పంచాయతీ కార్యదర్శులు ధ్రువీకరణ పత్రాలు తేవాలని ఈత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని వారు అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని నల్గొండ ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించినారు. ఈ కార్యక్రమంలో ఉప్పల గోపాల్ నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్ కుమార్ గోవర్ధన్ నేలపట్ల నరసింహ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు
