అభివృద్ధి, సంక్షేమం రెండు లక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడుచుకుంటుంది.

సభను విజయవంతం చేసిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు.

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Published On
అభివృద్ధి, సంక్షేమం రెండు లక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడుచుకుంటుంది.

 


 

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.లోకల్ గైడ్.

 


నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ...
నిన్న నకిరేకల్ పట్టణంలో  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా వికాస సభకు వేలాది సంఖ్యలో ప్రజలు తరలివచ్చి, రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజాపాలనకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారని అన్నారు.అభివృద్ధి, సంక్షేమం రెండు లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. సభను విజయవంతం చేసిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నకిరేకల్ కు ముఖ్యమంత్రి ఇచ్చిన వరాలు - చేసిన శంకుస్థాపనలు (మొత్తం రూ.339 కోట్లు):

- రూ.32 కోట్లతో - 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవం
- రూ.200 కోట్లతో - యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం
- రూ.45.60 కోట్లతో - రోడ్ల నిర్మాణ పనులు
- రూ.17.50 కోట్లతో - నకిరేకల్ పట్టణ రోడ్ల నిర్మాణం
- రూ.12 కోట్లతో - నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయాల నిర్మాణం
- రూ.20 కోట్లతో - ప్రభుత్వ కార్యాలయాల సముదాయ నిర్మాణం
- రూ.9.85 కోట్లతో - తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం
- రూ.1.10 కోట్లతో - ఎక్సైజ్ కార్యాలయ నిర్మాణం
- రూ.90 లక్షలతో - వెటర్నరీ ఆసుపత్రి నిర్మాణం
- రూ.127 కోట్ల చెక్కును మహిళా సంఘాల అభివృద్ధి కోసం అందజేత

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు:

ఆసిఫ్ నగర్ కెనాల్ ద్వారా సుమారు 60 చెరువులు నిండేలా చర్యలు తీసుకుంటామని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.నకిరేకల్ నుండి తిప్పర్తి వరకు రోడ్డు అభివృద్ధి, కట్టంగూర్ నుండి నల్లగొండ వరకు రోడ్డు అభివృద్ధి, అలాగే కట్టంగూర్ పట్టణంలో అండర్ పాస్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియం అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే చెరువుగట్టు ఆలయ అభివృద్ధికి కూడా త్వరలో ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.వెయ్యి రోజుల ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం అందజేత, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు.నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన ధ్యేయమని, అలాగే నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ని కోరినట్లు తెలిపారు.ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News