- District News
- భార్యను హత్య చేసిన నిందితుడి అరెస్ట్....
భార్యను హత్య చేసిన నిందితుడి అరెస్ట్....
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని నెన్నెల గ్రామంలో ఈనెల 2న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు తోట మల్లేష్‌ను నెన్నెల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.బెల్లంపల్లి రూరల్ సిఐ సిహెచ్ హనూక్ తెలిపిన వివరాల ప్రకారం
మృతురాలు తోట సబిత (38)పై అనుమానంతో నిందితుడు ఆమెను తరచూ వేధిస్తు గొడవపడేవాడని,గతంలో కూడా ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.ఈనెల 2న మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో నిందితుడు తన భార్య గొంతు నులిమి,అనంతరం ఇంట్లోని పదునైన ఆయుధంతో ఆమె గొంతుపై దాడి చేసి హత్య చేసినట్లు సిఐ తెలిపారు.విశ్వసనీయ సమాచారం మేరకు తాళ్లగురజాల వై జంక్షన్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు సిఐ తెలిపారు.నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఎసిపి కిరణ్ కుమార్ అభినందించి ప్రశంసించారు.
