కోడాడ 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఖమ్మం ఎస్‌ఈ సమీక్ష

Published On
కోడాడ 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఖమ్మం ఎస్‌ఈ సమీక్ష


ఖమ్మం, అక్టోబర్,8: లోకల్ గైడ్:
విద్యుత్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలని ఖమ్మం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి  సూచించారు.

ఈ సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కోడాడ లోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ఖమ్మం సర్కిల్ ఎస్‌ఈ శ్రీ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గారు,  సూర్యాపేట ఎస్‌ఈ శ్రీ పెరికేటి యాదగిరి గారి కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత డివిజనల్ ఇంజనీర్లు, టి.జి.ట్రాన్స్‌కో ఇంజనీర్లతో సబ్ స్టేషన్ పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్ధ్యం మరియు ఫీడర్ల సరఫరా పరిస్థితి పరిశీలించారు. ముఖ్యంగా 33 కేవీ బుద్ధారం ఫీడర్ విద్యుత్ సరఫరా పరిస్థితి, లోడ్ స్థితిగతులు, సబ్‌స్టేషన్ పనితీరు తదితర అంశాలను సమీక్షించారు.

సబ్‌స్టేషన్‌లో ప్రస్తుతం 2×50 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న నేపథ్యంలో, పెరుగుతున్న లోడ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పరిశీలించారు. గతంలో తొలగించిన 50 ఎంవీఏ మూడవ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పునఃస్థాపించి (Re-erection) అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించారు.

ఇటీవల అధిక లోడ్ కారణంగా బుద్ధారం 33 కేవీ ఫీడర్‌కు పవర్ లిమిటేషన్ విధించిన పరిస్థితిని కూడా సమీక్షించారు. వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని లోడ్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట సర్కిల్ ఎస్‌ఈ, సంబంధిత డీఈలు, టి.జి.ట్రాన్స్‌కో ఇంజనీర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యలు ఉంటే వినియోగదారులు 24/7 టోల్‌ఫ్రీ నంబర్ 1912 లేదా ఖమ్మం జిల్లా కంట్రోల్ రూమ్ 87124 83490ను సంప్రదించాలని కోరారు.

Tags:

About The Author

Latest News

గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి! గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
        కారేపల్లి, అక్టోబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం జిల్లా గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని యాదవ బజారు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
కారేపల్లిలో ఎల్‌నినోపై అలర్ట్‌.. పొదుపు చర్యలకు సర్పంచుల సిద్ధం! రంజిత్ కుమార్ 
బతుకమ్మ ఆడపడుచులకు చీరల కానుక.. గుడిపూడి తిరుమల రావు ఆప్యాయత!