బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో అభివృద్ధి.. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై నందిగామలో బీఆర్ఎస్ నిరసన అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ విగ్రహనికి కాంగ్రెస్ బాకీ కార్డుల అందజేత

పల్లెల విధ్వంసం.. పడకేసిన పారిశుద్ధ్యంపై ప్రజల్లో చైతన్యం
Published On
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో అభివృద్ధి.. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజల ముందుంచేందుకు బీఆర్ఎస్ చేపట్టిన ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నందిగామ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఇంటింటికీ తిరిగి బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కేవలం నిరసనకే పరిమితం కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేసి, ఆ హామీల్లో ఏవి అమలయ్యాయి.. IMG-20260906-WA0071ఏవి ఇంకా బాకీ ఉన్నాయి అనే విషయాలను ప్రజలకు వివరించడమే ప్రధాన ఉద్దేశం అని అంజయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, చెత్త సేకరణ, డ్రైనేజీ, పరిసరాల పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలను మార్చి, పారిశుద్ధ్యం, హరితహారం, మౌలిక వసతులు, గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం నిరంతరం పనిచేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రశ్నించడమే ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ కార్యక్రమం లక్ష్యమని అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. పల్లెల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో నెలకొన్న దుస్థితికి మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరిస్తూ.. హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రజా ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ పీఎసీఎస్ చైర్మన్ విఠల్, సర్పంచ్ జెట్ట కుమార్, మాజీ సర్పంచ్ రాజు, మాజీ ఎంపీటీసీ సురేష్, నాయకులు కొమ్ము వెంకటయ్య, ఎర్రగారి స్వామి, ఎర్ర శ్రీనివాస్, పెంటయ్య, కుమార్ గౌడ్, రాంబాబు తదితరులు, గ్రామ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News