- District News
- Warangal
- కుడా ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుదారాణి
కుడా ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుదారాణి
పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 05
(లోకల్ గైడ్ న్యూస్)
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌పర్సన్‌గా గుండు సుదారాణి శనివారం బాధ్యతలు స్వీకరించారు.
హనుమకొండలోని కుడా కార్యాలయంలో నిర్వహించిన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగం గా....ఛాంబర్ లో అధికారికంగా కుడా ఛైర్ పర్సన్ గా గుండు సుధారాణి పదవీ బాధ్యతలు చేపట్టారు.
వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్ పూర్, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కుడా వైస్ చైర్మన్/ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, తదితరుల సమక్షంలో కుడా ఛైర్ పర్సన్ గా గుండు సుధారాణి బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చాలు, పూల మొక్కలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
కుడా ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుండు సుదారాణి మాట్లాడుతూ...తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
కుడా పరిధిలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని నూతనంగా కుడా చైర్‌పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణికి అభినందనలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
17 Sep 2026 18:01:55
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ధరల
