ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్

Published On
ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్

 

లోకల్ గైడ్, మోమిన్ పేట్ వికారాబాద్ జిల్లా :

మోమిన్ పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ మరియు 'కేవీఆర్ (కేవీర్ ) ట్రస్ట్' సంయుక్తంగా కీలక అడుగు వేశాయి. కేవీఆర్ ట్రస్ట్ ఆర్థిక సౌజన్యంతో గ్రామంలో నిర్మించనున్న పశువుల తాగునీటి తొట్టి (వాటర్ ట్యాంక్) స్థలాన్ని సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించి మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
గ్రామ సర్పంచ్ పటేల్ శ్రీకాంత్ గౌడ్, గ్రామ కార్యదర్శి నర్సింలు మరియు పంచాయతీ అధికారుల సమక్షంలో ఈ స్థల సేకరణ, మార్కింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ... వేసవికాలంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రామంలోని పశువులకు నీటి ఎద్దడి కలగకుండా ఉండేందుకే కేవీఆర్ ట్రస్ట్ ఈ సామాజిక బాధ్యతను చేపట్టిందని తెలిపారు. పశువులకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు.
పశువుల సంక్షేమం కోసం ముందుకు వచ్చి నీటి తొట్టి నిర్మాణాన్ని చేపడుతున్న కేవీఆర్ ట్రస్ట్ ఉదారతను గ్రామ సర్పంచ్, పంచాయతీ అధికారులు మరియు గ్రామస్తులు కొనియాడి, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్ ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్
    లోకల్ గైడ్, మోమిన్ పేట్ వికారాబాద్ జిల్లా : మోమిన్ పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ మరియు
ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు. 
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                              
తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 
సింగరేణి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆరెళ్ల రవి గౌడ్
మేధావుల గళం.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా!
నర్సంపేట మండలంలో పైపులైన్ లీకేజీతో మిషన్ భగీరథ వృథాగా పోతున్న నీరు