డిప్లొమా - పాలిటెక్నిక్ విద్యను సివిల్ యూనివర్సిటీల్లో విలీనం చేయడం సరికాదు

ఎస్ఎఫ్ఐ  షాద్ నగర్ డివిజన్ సెక్రటరీ వడ్ల శ్రీకాంత్ విద్య దూరం ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు

హస్టల్స్, ల్యాబ్స్, భవనాలు, నిధులు ఇచ్చి, అభివృద్ధి చేయాలి. పాలిటెక్నిక్ అధ్యాపకులు, సిబ్బంది సర్వీస్ నిబంధనలకు రక్షణ కల్పించాలి.
Published On
డిప్లొమా - పాలిటెక్నిక్ విద్యను సివిల్ యూనివర్సిటీల్లో విలీనం చేయడం సరికాదు

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

డిప్లొమా, పాలిటెక్నిక్ విద్యను సివిల్ యూనివర్సిటీల్లో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పునరాలోచించాలని  ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ సెక్రటరీ శ్రీకాంత్IMG-20260817-WA0073 డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం అమలైతే పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేకమైన విద్యా విధానం, సాంకేతిక శిక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన కోర్సులు ఉన్నాయని తెలిపారు. డిప్లొమా విద్యను ప్రత్యేక వ్యవస్థగా కొనసాగించడం వల్ల విద్యార్థులకు బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా అవకాశాలకు వెళ్లే మార్గాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ముఖ్యంగా పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ విద్యాసంస్థలను ఇతర వ్యవస్థల్లో విలీనం చేయడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులపై అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలను కాపాడుతూ సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ టౌన్ ఉపాధ్యక్షులు అదిల్, చరణ్, రాంచరణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్, బబ్లు, రాజేష్, రాకేష్, భాను వంశీ, విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.