- District News
- జాతీయ జెండా ఆవిష్కరించిన అధ్యక్షులు బండారి మల్లయ్య . బయ్యారం సహకార సంఘంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ...
జాతీయ జెండా ఆవిష్కరించిన అధ్యక్షులు బండారి మల్లయ్య . బయ్యారం సహకార సంఘంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు. మహనీయుల త్యాగాలు మరవలేనివి.
లోకల్ గైడ్ ఆగస్టు 15 బయ్యారం.80 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బయ్యారం సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జెండా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం అధ్యక్షులు బండారి మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, నాయకులు, సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం అధ్యక్షులు బండారి మల్లయ్య మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను మరువలేమని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, వారి ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బయ్యారం సర్పంచ్ శాంతి, ఉపసర్పంచ్ ఏనుగుల ఉమా,డైరెక్టర్లు కసనబోయిన శ్రీను, నుద్దునూరి యశోద లింగయ్య, గాడుదుల కేతమల్లు, వార్డ్ సభ్యులు పెద్దినేని శాంత, బట్టు ఉమా, మాజీ సొసైటీ చైర్మన్ తిరుమల సంజీవరెడ్డి, వార్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తగిరె సత్తిరెడ్డి, ముల్కూరి వీరారెడ్డి, బత్తిని రామ్మూర్తి, నాయిని శ్రీనివాసరెడ్డి, పోలేబోయిన వెంకటేశ్వర్లు, పెద్దినేని వెంకటేశ్వర్లు, పులి మల్లయ్య, తాటి జనార్ధన్, గుగులోత్ పృద్వి, కంకటి నారాయణ, ఏనుగుల రంజిత్, మండా రేణుక, నందిపాటి భవాని, సూర్యనారాయణ, కత్తి రాధకృష్ణ, రామగిరి వెంకటేశ్వర్లు, రైతులు సూరం రవీందర్ రెడ్డి, సుద్దపల్లి నారాయణరెడ్డి, చల్లగుండ్ల వెంకటనారాయణ, సుంకరి రజిని, రామ వెంకట మల్లు, వెంకన్న,సర్దార్, వీరన్న, మహేష్, గణేష్, యాదగిరి, సోమిరెడ్డి, సందీప్, ఐలయ్య, మునిందర్, సాయి, సొసైటీ సీఈఓ సురేందర్, సిబ్బంది, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
