ప్రభుత్వ భూములను కాపాడండి 

ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందే లక్ష్మణరావు 

Published On
ప్రభుత్వ భూములను కాపాడండి 

గండిపేట్, ఆగస్టు 11 (లోకల్ గైడ్):

నార్సింగి సర్కిల్ మణికొండ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూములు అక్రమ కబ్జాలకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ భూములను కాపాడాలని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందే లక్ష్మణరావు అన్నారు.  నార్సింగి సర్కిల్ మణికొండ డివిజన్ జాగిర్ లోని సర్వే నంబర్ 42 లోని 1,450 చదరపు గజాల భూమిని మంగళవారం శేర్లింగంపల్లి సబ్ రిజిస్టర్ను, నార్సింగ్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ను, గండిపేట మండల ఎమ్మార్వో ను, హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ అధికారులను సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రభుత్వ భూములను కాపాడాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మణికొండ జాకీర్ పంచవటి కాలనీ గల సర్వే నంబర్ 42 లో 1450 చదరపు గజాల స్థలాన్ని గత 15 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిగా సూచిస్తూ ఏర్పాటుచేసిన బోర్డును ఈమధ్య ప్రైవేట్ వ్యక్తులు తొలగించినట్లు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ బోర్డును ఏ ప్రక్రియ రికార్డుల ప్రకారం ఏర్పాటు చేశారు రెవెన్యూ అధికారులు తెలపాలని అన్నారు. ఏదైనా సర్వే నంబర్ సరిహద్దుల నిర్ధారణ నిర్వహించారు లేక తనిఖీ నివేదికలు ఫోటోలు దాని తొలగింపులకు సంబంధించిన ఫిర్యాదులు నివేదికలు రెవెన్యూ అధికారులు తీసుకున్న చర్యలను సమర్పించండని, ప్రభుత్వ భూమిగా వర్గీకరించబడినప్పటికీ అట్టి భూమికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌతికంగా రక్షించక పోవడానికి నమోదు చేసిన గల కారణాలు కూడా సమర్పించాలని ఉన్నతాధికారులను ఆయన కోరారు.

Tags:

About The Author

Latest News