పచ్చదనంతోనే భావితరాలకు భవిష్యత్‌ భరోసా : కారేపల్లి సర్పంచ్ టోనీ 

వన మహోత్సవంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు సర్పంచ్ టోనీ 

Published On
పచ్చదనంతోనే భావితరాలకు భవిష్యత్‌ భరోసా : కారేపల్లి సర్పంచ్ టోనీ 

 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగస్టు 25 ( లోకల్ గైడ్ ) :

కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ రాంబాబు, ఎంపీడీవో పద్మ, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, గ్రామపంచాయతీ కార్యదర్శి నెహ్రూ, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి, కారేపల్లి సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ) తదితరులు మొక్కలు నాటారు. ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ) మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కారేపల్లి గ్రామపంచాయతీని పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News