నేత్రదానం చేయండి మరొకరికి చూపు ఇవ్వండి 

ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు..

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ పిలుపు
Published On
నేత్రదానం చేయండి మరొకరికి చూపు ఇవ్వండి 



 

లోకల్ గైడ్ తెలంగాణ రాజన్న సిరిసిల్ల:

మనిషి జీవితం ముగిసిన తర్వాత కూడా అతని ద్వారా మరొకర జీవితంలో వెలుగును నింపగలడని, చూపును కోల్పోయిన వారికి కొత్త ఆశను అందించే మహత్తర సేవ నేత్రదానం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పేర్కొన్నారు. జాతీయ అంధత్వం, దృష్టి లోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జిల్లా వ్యాప్తంగా 41 వ నేత్రదాన పక్షోత్సవాల నిర్వాహణ లో భాగంగా ఈ రోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిరిసిల్ల నుండి గాంధీ చౌక్ సిరిసిల్ల వరకు చేపట్టిన ర్యాలీ  సందర్భంగా  ఆమె మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానానికి సంబంధించి ఉన్న ఆపోహలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒకరి నేత్ర ధా నం... ఇద్దరి జీవితాల్లో వెలుగు ఒక వ్యక్తి మరణించిన అనంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా  ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని తెలిపారు. ఒకరిజీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో
వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుందని పేర్కొన్నారు. వ్యక్తి మరణించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా ఆరు నుండి ఎనిమిది గంటలలోపు నేత్రధానం చేయడం ద్వారా నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానంతో మృతదేహ రూపంలో మార్పు ఉండదని సృష్టం చేశారు. వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవ ప్రదంగా సేకరిస్తారని తెలిపారు.
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న ఆపోహలను తొలిగింది, మరణానంతరం నేత్రధానానికి కుటుంబ సభ్యలు ముందుకు రావాలని కోరారు. అనేక మంది నేత్రదానానికి అర్హులు రక్తపోటు, క్షయవ్యాధి ఉబ్బసం ఉన్నవారు కళ్లద్దాలు ఉపయోగించేవారు, శుక్షాల శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా అనేక సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే దీని అర్హత ను  వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు.  నేత్ర దానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణా నంతరం కూడా మానవత్వం కొనసాగించే గొప్ప సేవ అని ఆమె పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని , జిల్లా అంధత్వ నివారణ programme అధికారి డాక్టర్ నయంజహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది,  ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు 
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 
రాజన్న సిరిసిల్ల

Tags:

About The Author

Latest News