రాంనగర్ లోనీ  బీసీ భవన్ లో ఘనంగా బీపీ మండల్ జయంతి వేడుకలు

సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బీపీ మండల్ యాదవ్

మాజీ కుడా చైర్మన్, ఓబీసీ చైర్మన్,ఎస్.సుందర్ రాజ్  యాదవ్...వెల్లడి
Published On
రాంనగర్ లోనీ  బీసీ భవన్ లో ఘనంగా బీపీ మండల్ జయంతి వేడుకలు

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు25
(లోకల్ గైడ్ న్యూస్)

హనుమకొండ,
సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బీపీ మండల్ జయంతిని స్మరించుకోవడం ఎంతో గర్వకారణమని మాజీ కుడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్ .సుందర్ రాజ్ యాదవ్  అన్నారు..హనుమకోండ  రాంనగర్ లో బీసీ భవన్ లోమంగళవారం బీపీ మండల్ మండల్ జయంతి వేడుకలు ఘనంగానిర్వహించారు.ఈ సందర్బంగా మాజీ కూడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్.సుందర్ రాజ్  యాదవ్ హజరై  పూలమాల వేసి నివాళులు ఆర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు,విద్య, ఉద్యోగాల్లో న్యాయం అందాలనే లక్ష్యంతో పనిచేశారని గుర్తు చేశారు. ఆయన నాయకత్వంలో ఏర్పడిన మండల్ కమిషన్ భారతదేశ సామాజిక చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిందన్నారు.వెనుకబడిన వర్గాల సామాజిక, విద్యా పరిస్థితులను అధ్యయనం చేసి వారికి తగిన అవకాశాలు కల్పించాలనే సిఫార్సులు చేయడం ద్వారా బీపీ మండల్  సామాజిక సమానత్వానికి బలమైన పునాది వేసిందని చేప్పారు.నేటి యువత బీపీ మండల్  జీవితాన్ని, ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు...ఈ కార్యక్రమంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఉద్యమకారుడు గంగాపురం వేణుమాధవ్ గౌడ్, మేనం శ్యామ్ , యాదగిరి గౌడ్, నాగరాజు  యాదవ్ ,చిరంజీవి యాదవ్ ,యుగేందర్ యాదవ్ , బీసీ మహిళా నాయకులు పద్మజ దెవి, మౌనిక,తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News