- District News
- Ranga Reddy
- గోడకొండ్లను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి చేర్చాలి.
గోడకొండ్లను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి చేర్చాలి.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ’ పరిధిలోకి నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన గోడకొండ్ల (మాల్ టౌన్) గ్రామాన్ని చేర్చి అధికారిక మాస్టర్ ప్లాన్‌లో స్థానం కల్పించాలని గ్రామస్థులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు....ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ సందుపట్ల లక్ష్మణ్ సాగర్, మండల సాధన సమితి నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్–సాగర్ హైవేపై రంగారెడ్డి జిల్లా సరిహద్దుకు అతి సమీపంలో, హైదరాబాద్‌కు కేవలం 50 కి.మీ. దూరంలో గోడకొండ్ల ఉందని పేర్కొన్నారు. చుట్టుపక్కల సుమారు 120 గ్రామాలకు వాణిజ్య కేంద్రంగా, పది వేలకు పైగా జనాభాతో మాల్ మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భాగమైన మీర్జాగూడ, లేమూరు, మీర్‌ఖాన్‌పేట్, కందుకూరు గ్రామాలకు ఇది ఆనుకుని ఉన్నప్పటికీ, అధికారిక జీవోలో పేరు లేకపోవడంతో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు... 2016 జిల్లాల పునర్విభజన సమయంలో తమ భౌగోళిక, ఆర్థిక పరిస్థితులను బట్టి రంగారెడ్డి జిల్లాలో కలపాలని కోరినా నల్గొండలోనే ఉంచడంతో తీవ్రంగా నష్టపోయామని గుర్తుచేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పరిధిని 56 నుంచి 71 గ్రామాలకు విస్తరించిన ప్రభుత్వం, భౌగోళికంగా సరిహద్దుగా ఉన్న గోడకొండ్లతో పాటు పరిసర ప్రాంతాలైన వెంకటేశ్వర నగర్, పోలేపల్లి, రాంనగర్, మదనాపురం గ్రామాలనూ ఇందులో చేర్చాలని డిమాండ్ చేశారు..ఈ విషయమై ఇప్పటికే గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ, బంజరు భూములు ఫ్యూచర్ సిటీ ల్యాండ్ బ్యాంక్‌కు ఉపకరిస్తాయని, తద్వారా యువతకు ఉపాధి లభించి ప్రాంతీయఅసమానతలుతొలగిపోతాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి గోడకొండ్లను ఎఫ్‌సీడీఏ పరిధిలో చేర్చి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
