స్వామి వివేకానంద పార్కును పట్టిపీడిస్తున్న అలసత్వం: స్ఫూర్తిప్రదాత విగ్రహం వెనక చెత్తాచెదారం!

Published On
స్వామి వివేకానంద పార్కును పట్టిపీడిస్తున్న అలసత్వం: స్ఫూర్తిప్రదాత విగ్రహం వెనక చెత్తాచెదారం!

 

వికారాబాద్ జిల్లా (లోకల్ గైడ్ జిల్లా బ్యూరో ప్రతినిధి):

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద పార్కు పేరు వింటేనే యువతలో ఒక రకమైన ఆవేశం, నవచైతన్యం వెల్లివిరుస్తాయి. ఆయన భావాలు, స్ఫూర్తివంతమైన ఆలోచనలు నేటికీ ఎంతోమందికి మార్గదర్శకం. అలాంటి మహనీయుడి పేరు మీద వెలసిన "స్వామి వివేకానంద పార్కు" నేడు పాలకులు, స్థానిక అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
 కీలక ప్రాంతంలో ఉన్నా పట్టించుకోని వైనం 
ఒకవైపు జిల్లా కేంద్ర గ్రంథాలయం, మరొకవైపు వ్యవసాయ శాఖ కార్యాలయం, మరోవైపు మండల ప్రజా పరిషత్ మరియు జిల్లా పరిషత్ కార్యాలయాలు... ఇలా ఎల్లప్పుడూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, నిత్యం పుస్తకాలు చదువుకునే విద్యార్థులు మరియు వందలాది మంది ప్రజలు సంచరించే అత్యంత కీలకమైన ప్రాంతంలో ఈ పార్కు ఉంది. కంటిముందే కనిపిస్తున్నా, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ దీని పరిశుభ్రతపై దృష్టి సారించకపోవడం అత్యంత విచారకరం.
చెత్తాచెదారానికి నిలయంగా మారిన పార్కు
మహాత్ముల విగ్రహాల వద్ద ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండాలి. కానీ, ప్రస్తుత వివేకానంద పార్కు పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. పార్కు ప్రాంగణంలో ప్లాస్టిక్ కవర్లు, ఎండిపోయిన ఆకులు, కొట్టి పడేసిన మొక్కలతో నిండిపోయింది. అంతేకాకుండా ఎండిన ఆకుల కింద విషసర్పాలు సంచరిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆహ్లాదాన్ని పంచాల్సిన ఈ పార్కు కాస్తా రోగాలకు నిలయంగా మారే ప్రమాదం విద్యార్థిని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 ప్రభుత్వ ఆఫీసుల అధికారుల కంటిముందే ఈ దుస్థితి! 
కేంద్ర గ్రంథాలయం ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి గ్రంథాలయానికి వస్తుంటారు. వారు కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందామన్నా, పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల వచ్చే దుర్గంధంతో పార్కు వైపు చూడలేకపోతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు వ్యవసాయ, మండల మరియు జిల్లా పరిషత్ కార్యాలయాలకు నిత్యం అనేకమంది రైతులు, ప్రజలు వివిధ పనులపై అధికారులను కలవడానికి వస్తుంటారు. కీలకమైన ఈ మూడు ప్రభుత్వ ఆఫీసుల ముందే ఈ రకమైన అపరిశుభ్రత దర్శనమిస్తుంటే అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయం.
ఇప్పటికైనా స్పందించాలి
మహనీయుల విగ్రహాలను కేవలం జయంతి, వర్ధంతుల రోజుల్లో పూలమాలలు వేయడానికే పరిమితం చేయకూడదు వారు ప్రాతినిధ్యం వహించే ప్రాంగణాలను శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత.
ముఖ్యంగా స్థానిక మండల ప్రజా పరిషత్ అధికారులు, మునిసిపల్ శానిటేషన్ సిబ్బంది తక్షణమే స్పందించి స్వామి వివేకానంద పార్కులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలి. పార్కును సుందరీకరించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి ఈ పార్కుకు పూర్వ వైభవం తీసుకువస్తారని ఆశిద్దాం!

Tags:

About The Author

Latest News

స్వామి వివేకానంద పార్కును పట్టిపీడిస్తున్న అలసత్వం: స్ఫూర్తిప్రదాత విగ్రహం వెనక చెత్తాచెదారం! స్వామి వివేకానంద పార్కును పట్టిపీడిస్తున్న అలసత్వం: స్ఫూర్తిప్రదాత విగ్రహం వెనక చెత్తాచెదారం!
    వికారాబాద్ జిల్లా (లోకల్ గైడ్ జిల్లా బ్యూరో ప్రతినిధి): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద పార్కు పేరు వింటేనే యువతలో ఒక రకమైన ఆవేశం, నవచైతన్యం
వికారాబాద్ బస్టాండ్‌లో మరుగుదొడ్లకు తాళం వేయడంపై స్పందించిన డిఎం నమ్రత 
సింగరేణిలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం
ఘనంగా శ్రీ ఉడిపి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం.
ధరల దోపిడీని అరికట్టాలి.. పేదలను ఆదుకోవాలి!
ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్
ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు.