- District News
- Khammam
- ఆపదలో అండగా నిలిచిన మాదారం సర్పంచ్ ఉమా నరేష్!
ఆపదలో అండగా నిలిచిన మాదారం సర్పంచ్ ఉమా నరేష్!
కమ్యూనిస్టు నేత నాగయ్యకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ బాధ్యతాయుత చర్యలు
కారేపల్లి, అక్టోబర్ 14 (లోకల్ గైడ్ న్యూస్ ) :
అనారోగ్యంతో బాధపడుతున్న కమ్యూనిస్టు నేత రావుల నాగయ్యకు మాదారం సర్పంచ్ ఉమా నరేష్ అండగా నిలిచారు. కుటుంబ సభ్యులు అందుబాటులో లేని సమయంలో బాధ్యతగా స్పందించి, మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టారు. సింగరేణి మండలం మాదారం గ్రామానికి చెందిన రావుల నాగయ్య గత ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన రక్త కణాల సంఖ్య 50 వేల స్థాయికి పడిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ విషయాన్ని ప్రభుత్వ వైద్యశాల వైద్యుడు డాక్టర్ సురేష్ సర్పంచ్ ఉమా నరేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఉమా నరేష్, కాంగ్రెస్ నేత నరేష్ కుమార్‌తో కలిసి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించి, వైద్యుల సూచన మేరకు నాగయ్యను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అక్కడ మెరుగైన వైద్యం అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన సహకారం అందించారు. ఈ సహాయక కార్యక్రమంలో వార్డు సభ్యుడు పాయం మునీందర్, తిరుమలగిరి నరేష్, బానోత్ కోటేష్, ఏనుగు శివయ్య, అంబులెన్స్ డ్రైవర్ పోతనబోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు అండగా నిలవడమే తన బాధ్యతగా భావిస్తూ, సకాలంలో స్పందించి నాగయ్యకు సహాయం అందించిన సర్పంచ్ ఉమా నరేష్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.
