పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని గెలిపించాలి

తల్లాడలో పట్టభద్రులకు అవగాహన కల్పించిన మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి

Published On
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని గెలిపించాలి

 

 

తల్లాడ. అక్టోబర్. 9: లోకల్ గైడ్,:

 *రానున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డిని అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు గొడుగునూరి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తల్లాడ పార్టీ కార్యాలయంలో పలువురు పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటు చేర్పుపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు నవంబర్ నుండి నిరుద్యోగ భృతి లక్ష లోపు ఇచ్చే విధంగా  ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు. పట్టభద్రులందరూ ఆలోచించి అనుభవం కలిగిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రుల ఓట్లను నమోదు చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుండేటి వీరారెడ్డి   మండల ఉపాధ్యక్షుడు తాళ్ల జోసెఫ్, అన్నారుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  తుమ్మలపల్లి రమేష్, నాయకులు కోడూరు రాము, యుగంధర్, బోడ నాగేశ్వరావు, దామవరపు కన్నయ్య,పట్టభద్రుల ఓటర్లు   తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాదర్గుల్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ మృతి.  నాదర్గుల్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ మృతి. 
కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే విద్యార్థిని మృతి, పలువురు విద్యార్థులకు గాయాలు.  కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలంటూ డిమాండ్,  భారీగా మోహరించిన పోలీసులు
గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
కారేపల్లిలో ఎల్‌నినోపై అలర్ట్‌.. పొదుపు చర్యలకు సర్పంచుల సిద్ధం! రంజిత్ కుమార్