ప్రతిభావంతులైన విద్యార్థులకు చిరు బహుమతులు

మండల టాపర్లను అభినందించిన 3వ వార్డు మెంబర్ సోమల్ల కరుణాకర్

Published On
ప్రతిభావంతులైన విద్యార్థులకు చిరు బహుమతులు

 

 

తుర్కపల్లి, ఆగస్టు 15:( లోకల్ గైడ్ )

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పడాల హైస్కూల్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తుర్కపల్లి 3వ వార్డు మెంబర్ సోమల్ల కరుణాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన తాటికొండ వైష్ణవి (తండ్రి: బాలరాజు), మండల స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిన షేక్ నాజియా (తండ్రి: ఇంతియాజ్)లను అభినందించారు.
అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిన పోకనాటి గౌతమి (తండ్రి: వీరబాబు)ను సైతం అభినందించారు.
విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో సోమల్ల కరుణాకర్ తన వంతుగా చిరు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా తోటి విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి, పోటీతత్వం పెరుగుతుందని అన్నారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.