పొంగులేటి' అభయం.. నిరుద్యోగులకు 'రైట్ ఛాయిస్'!

ఖమ్మం, కొత్తగూడెంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్

పోస్టర్‌ను ఆవిష్కరించిన క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి
Published On
పొంగులేటి' అభయం.. నిరుద్యోగులకు 'రైట్ ఛాయిస్'!

ఖమ్మం,ఆగస్టు17: లోకల్ గైడ్:
పోలీస్ కొలువు సాధించి ఖాకీ డ్రెస్‌లో చూడాలనే పేద తల్లిదండ్రుల కలలకు, నిరుద్యోగ యువత పట్టుదలకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉచిత కోచింగ్ కొండంత అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అభ్యర్థుల కోసం ఖమ్మం, కొత్తగూడెం పట్టణాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2016లోనే పొంగులేటి ఉచిత కోచింగ్ ద్వారా వందలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించి నిలదొక్కుకున్నారని గుర్తుచేశారు. ఈసారి హైదరాబాద్‌కు చెందిన అత్యుత్తమ ఫ్యాకల్టీలతో నాణ్యమైన బోధన అందించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ప్రతిరోజూ మాక్ టెస్టులు, ఉచితంగా ప్రింటెడ్ స్టడీ మెటీరియల్, వారానికోసారి గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ ఫలితమే లక్ష్యంగా తరగతులు నడుస్తాయన్నారు.

రాష్ట్రంలో పోటీ పరీక్షల శిక్షణలో అగ్రగామిగా ఉన్న 'రైట్ ఛాయిస్ అకాడమీ' చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ నేతృత్వంలో ఈ పొంగులేటి ఉచిత శిక్షణ సాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గతంలో 2016లో పొంగులేటి-రైట్ ఛాయిస్ కలయికలో ఇచ్చిన శిక్షణ ద్వారా ఒకే బ్యాచ్ నుంచి ఏకంగా 326 మంది కానిస్టేబుళ్లు, 18 మంది ఎస్‌ఐలు ఎంపికై చరిత్ర సృష్టించారని కిరణ్ గుర్తుచేశారు. ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పం ఉన్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

శిక్షణ పొందేందుకు అభ్యర్థులు తమ వివరాలను (పేరు, ఫోన్ నంబర్, గ్రామం, మండలం, నియోజకవర్గం) క్రింది నంబర్లకు వాట్సాప్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా అభ్యర్థులు 8985095599, భద్రాద్రి కొత్తగూడెం అభ్యర్థులు 8985096699 సంప్రదించాలని మెండెం కిరణ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొర్రా రాజశేఖర్, ఏదులాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, కోసూరి శ్రీను, కొప్పుల అశోక్ , బజ్జూరి వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ వెంకట్ రెడ్డి, వెన్నుపూసల సీతారాములు, బానోత్ కిశోర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.