అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఏరివేయాలి 

ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్*

అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఏరివేయాలి 

పహాల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు 

క్లాక్ టవర్ సెంటర్లో క్యాండిల్ ర్యాలీ

లోకల్ గైడ్ :

జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో పర్యాటకులపై అమానుషంగా కాల్పులు జరిపి 26 మంది మృతికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతవత్ శంకర్ నాయక్ అన్నారు. పహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులపై కాలుపులు జరపడం అమానుష చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉగ్రవాదులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించాలని కోరారు. పహాల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బరూప, పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, పలువురు కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ రాజకీయాల్లో అధికార పోరు: కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నవి తెలంగాణ రాజకీయాల్లో అధికార పోరు: కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నవి
హైదరాబాద్, మే 29:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మాజీ పాలకులు బారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మధ్య రాజకీయ పోరు రోజురోజుకు ముదురుతోంది. 2023 డిసెంబర్...
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్: మెట్రో విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి.. భూ సేకరణపై వివాదాలు
ముంబయిని వదిలేయడం కష్టం.. కానీ అవకాశాలు లేకపోయాయి" – అర్మాన్ జాఫర్
సరస్వతి పుష్కరాల ఆదాయం రూ.2.83 కోట్లు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి
రాజ్యసభకు కమల్ హాసన్! 
ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీకి భారత్‌లో నూతన అధ్యాయం – కర్ణాటకలో తొలి కేంద్రం