స్వధార్ హోమ్ లో మానిటరింగ్ కమిటీ చేసిన తనిఖీలు చేసింది సరే...
స్వధార్ హోం చైర్మన్ బర్నబాస్ చౌదరిపై చర్యలేవి???

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో బాధిత మహిళలకు అండగా నిలబడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో స్వధార్ హోం గత కొన్ని ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.. అయితే ఆది నుండి నిర్వాహకులైన బర్నబాస్ చౌదరిపై ఆరోపణలు జిల్లా కలెక్టర్, పాలన యంత్రాంగం ప్రతి ఒక్కరికి వెల్లువెత్తుతున్న విషయాలు తెలిసిందే.. అయితే గతంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో స్వధార్ హోమ్ లో ఓ బాధిత మహిళ తనపై అత్యాచారయత్నం చేసిన ఆరోపణ విషయంపై జిల్లా న్యాయమూర్తికి స్వయాన వాంగ్మూలం ఇచ్చిన విషయం అప్పట్లో సంచలనం రేపిన సంఘటనే... అయితే ఈ ఒక్క సంఘటనే కాకుండా పలు కేసులు ఉన్నట్లు సమాచారం..అలాగే ఇటీవల కాలంలో స్వధార్ హోమ్ లో వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని రసూల్ బి మరియు సంబంధిత అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే... అప్పట్లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశానుసారం మహిళల సంరక్షణార్థం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నియమ నిబంధనలు పాటించడం లేదని బిల్లులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయము తెలిసిందే... అనంతరం పర్యావసనాలు సైతం జిల్లా కలెక్టర్ తో పాటు పాలన యంత్రాంగము అందరికీ తెలిసిందే... ఇటీవల కాలంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ మరియు అదనపు కలెక్టర్ అంకిత్ మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రసూల్ బి మరియు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య బృందంతో మానిటరింగ్ కమిటీ పర్యవేక్షించి రికార్డులను తనిఖీ చేసిన విషయము అందరికీ తెలిసిందే... రికార్డుల పరిశీలనలో అవకతవకలు అలాగే అక్కడి సిబ్బంది మరియు మహిళల సంరక్షణార్థం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి నిబంధనలు ఏవి కూడా సక్రమంగా పాటించడం లేదనే విషయం కమిటీ గుర్తించిన సంగతి తెలిసిందే... అలాగే రెండేళ్లుగా ఎలాంటి అనుమతి లేకుండా స్వధార్ హోం కొనసాగడం పట్ల జిల్లాలో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇలా చాలా విషయాలు బహిర్గతమైనప్పటికీ ఇంకా ప్రస్తుతానికి స్వధార్ హోమ్ చైర్మన్ గా తాత్కాలికంగా బర్నబాస్ చౌదరి కొనసాగడం అనేది పలు విమర్శలకు తావిస్తుంది.. స్వధార్ హోమ్ నిర్వహణ లోపంలో అలాగే పలు కేసులు ఉన్నప్పటికీ సదరు చైర్మన్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని వేచి చూస్తున్నారు.. అయితే ప్రస్తుతానికి స్వధార్ హోమ్ సూపర్డెంట్ గా జ్యోత్స్న విధులు నిర్వర్తిస్తున్నట్టు సమాచారం...
About The Author
Related Posts
Latest News
