మోనాలిసాను ఇప్పుడు చూశారా.......

ఇప్పుడు ఎలా ఉందో .....

మోనాలిసాను ఇప్పుడు చూశారా.......

లోక‌ల్ గైడ్ :

మహా కుంభమేళ 2025లో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన అమ్మాయి మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్‌కి చెందిన ఈ 16 ఏళ్ల బ్యూటీ, ప్రయాగ్‌రాజ్‌లో రుద్రాక్ష మాలలు, పూసల దండలు అమ్ముతూ ఉండగా, ఆమెను ఓ నెటిజన్ వీడియో తీసి షేర్ చేయడం తో ఒక్కరాత్రే స్టార్ అయిపోయింది. ఆకర్షణీయమైన కన్నులు, ఆ చిరునవ్వు, సహజమైన అందంతో నెటిజన్లను కట్టిపడేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. పూసలు అమ్మే అమ్మాయి నుంచి ఒక్కసారిగా బాలీవుడ్ ఎంట్రీకి చేరువైంది. సినిమా డెబ్యూ కోసం కొంత సమయం పడుతున్నా, అప్పటికే మోనాలిసా మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇటీవల ఆమె ఓ మ్యూజిక్ వీడియోలో నటించింది. ఉత్కర్ష్ సింగ్‌ తో జతకట్టిన ఈ సాంగ్‌ ఇటీవల యూట్యూబ్‌లో విడుదలై రచ్చ చేస్తోంది. ఎంబ్రాయిడరీ లెహంగా, ఎలిగెంట్ జ్యూవెలరీతో మోనాలిసా ఈ వీడియోలో అందాన్ని మరింత పెంచింది. డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘‘ఈ అమ్మాయి హీరోయిన్స్‌కి ఏమి తక్కువ’’ అంటూ కామెంట్లతో దుమ్ము రేపుతున్నారు. అంతేకాదు, ఈ సాంగ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె ఫ్యాన్స్ భారీగా వ్యూస్ కలిపేస్తున్నారు.

సనోజ్ మిశ్రా (Sanoj Mishra) దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ సినిమాలో మోనాలిసా లీడ్ రోల్‌లో నటించనుంది. నటనను మెరుగుపర్చడానికి స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటూ, తన బాలీవుడ్ డెబ్యూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ‘సాద్గి’ సాంగ్‌కి వచ్చే లైక్స్, కామెంట్స్ చూస్తేనే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పూసలు అమ్మే అమ్మాయి నుంచి కలల రాణిగా మారిన మోనాలిసా జర్నీ, ప్రతిఒక్కరికీ అవకాశముంటే ఆకాశాన్ని కూడా అందుకోవచ్చని స్ఫూర్తినిస్తోందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ భామ వెండితెరపై ఎలా రాణిస్తుందో చూడాలి!

Tags:

About The Author

Advertisement

Latest News

పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి.. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో స్మృతి మంధాన అగ్రస్థానం
పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......
ఇంటర్నేషనల్ యోగ డే 2025 జూన్, 21 న పతంజలి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం
సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి