క్రికెటర్ నన్ను రిటైర్ అవాలని సలహా ఇచ్చాడు.....
By Ram Reddy
On
భారత క్రికెటర్ కరణ్ నాయర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శనతో దాదాపు ఏడేళ్ల తరువాత తిరిగి టీమ్ ఇండియాలో చోటు సంపాదించిన కరణ్, డైలీ మెయిల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘‘ఇంకా గుర్తుంది... సరిగ్గా రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ భారత క్రికెటర్ నన్ను రిటైర్ అవాలని సలహా ఇచ్చాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావడం అసాధ్యం, ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లలో ఆడి డబ్బు సంపాదించుకోవచ్చని అన్నాడు. కానీ నాకు డబ్బు కన్నా భారత జట్టులో మళ్లీ ఆడాలని ఉన్న ఆశ ఎక్కువ. అందుకే ఆలోచించకుండా తిరిగి దేశవాళీ క్రికెట్‌కు మళ్లాను. టోర్నీల్లో మంచి ప్రదర్శన చూపిస్తూ చివరకు టెస్టు జట్టులోకి వచ్చాను. నన్ను నేను మళ్లీ నిరూపించుకున్నాను,’’ అని కరణ్ నాయర్ స్పష్టం చేశాడు.
Tags:
About The Author
Latest News
17 Jun 2025 17:55:40
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...