మంత్రి శ్రీహరికి రాష్ట్ర సగర సంఘం సత్కారం

 -కాంగ్రెస్ పార్టీకి, సిఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన శేఖర్ సగర 

మంత్రి శ్రీహరికి రాష్ట్ర సగర సంఘం సత్కారం

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ): తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, క్రీడలు, మత్సకార,  యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సోమవారం సచివాలయం లోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ సగర సంఘం మంత్రికి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసింది. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, కార్యనిర్వాహక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసం చెన్నయ్య సగర లు మంత్రిని తన ఛాంబర్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ.. బీసీల పక్షపాతిగా ఉన్న ముదిరాజు బిడ్డ డాక్టర్ వాకిటి శ్రీహరికి క్యాబినెట్ లో స్థానం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజులలో మెజారిటీగా ఉన్న బీసీల కోసం మరో ముగ్గురికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి.. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో స్మృతి మంధాన అగ్రస్థానం
పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......
ఇంటర్నేషనల్ యోగ డే 2025 జూన్, 21 న పతంజలి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం
సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి