భీమ్స్ చేతికి విశ్వంభర?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీలలో విశ్వంభర (Vishwambhara) ఒకటి. అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా గడుపుతుంది. సినిమా టీజర్‌పై విపరీతంగా ట్రోల్స్ రావడంతో గ్రాఫిక్స్‌పై మరింత కష్టపడుతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పరంగా ప్రస్తుతం స్పెషల్ సాంగ్ ఒక్కటే బ్యాలన్స్ ఉందని సమాచారం. అయితే ఈ సాంగ్ ఇంకా ఒకే కాలేదని.. కీరవాణి సంగీతం అందించిన సాంగ్ చిరుకి నచ్చలేదని.. అందుకే.. కొత్త సంగీత దర్శకుడు భీమ్స్‌తో చిత్రయూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి చిత్రబృందం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు ఒక సినిమా చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు.